Saturday, July 24, 2010

ప్రార్ధన

శ్రీ కరుడవ్ పార్వతి దేవి
అగ్రసుతుని అనవరతము
స్తుతిఎంచాద నే చేసడి పనులెల్ల
సఫలము కాగా భార్గవ

అమ్రుతమన్న అమ్మ స్తన్యము
కామధ్యనువన్న అమ్మ దీవెన
కల్పవ్రుషమన్న అమ్మ ప్రేమ
స్వర్గమన్న మరి వైరుకాదయ అమ్మ వడియె భార్గవ

జీవుల యందు జాలియు
సతి, సుతులయందు ప్రేమయు
భగవంతుని మీద భక్తియు
గలవాడే మనుజుదన భార్గవ

ఉరక పరుల సొమ్ము కోరుటయు
తన సొత్తును ఇసుమంతయు ఇవ్వకుండుట
పర భాదల చూసి నవ్వుటయు
ఖలులులు చేసటి పనులు భార్గవ

అన్నదమ్ములు నావారని
అలిబిడ్డలు నావారని
ఆస్తిపాస్తులు నావని
ధనసంపదలు నావనే బ్రాంతిలోన వుంటిమి
కలుడోచ్చిన నాడు కాయమ్ముకుడా నడికాదయ భార్గవ

తనువూ మీద మోజు
తిండి మీద మోజు
ఇల్లు వాకిలి పైన మోజు
ఆలి బిడ్డల పైన మోజు
కట్టు బట్టల పైన మోజు
కాలమంత ఇటుల కర్చు చేస్తే
దేవ సన్నిదికి చేరుటేతుల భార్గవ

అన్నదమ్ములు కల్ల
అలిబిడ్డలు కల్ల
ఇల్లువాకిలి కల్ల
ఆస్తిపాస్తులు కల్ల
ఆత్మ వక్కటే నిక్కము భార్గవ

అమ్రుతమన్న అమ్మ స్తన్యము
కామధ్యనువన్న అమ్మ దీవెన
కల్పవ్రుషమన్న అమ్మ ప్రేమ
స్వర్గమన్న మరి వైరుకాదయ అమ్మ వడియె భార్గవ

జీవుల యందు జాలియు
సతి, సుతులయందు ప్రేమయు
భగవంతుని మీద భక్తియు
గలవాడే మనుజుదన భార్గవ

ఉరక పరుల సొమ్ము కోరుటయు
తన సొత్తును ఇసుమంతయు ఇవ్వకుండుట
పర భాదల చూసి నవ్వుటయు
ఖలులులు చేసటి పనులు భార్గవ

తియ్యని తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కేగాబ్రాకినట్లు భార్గవ

ఆకలితో తిన్న అన్నము
అవసరముకు అందిన ధనము
వైరితో తిరిగి సక్యము
ధరణిని మరువంగా తరమే భార్గవ

గంధము లేని సుమములు
సోయగము లేని మగువలు
మానవత్వము లేని మనుజుడును
ధరణిలో వ్యర్ధము భార్గవ

తల్లికి అన్నము పెట్టని వాడును
సతి సుతులను కానని వాడును
సఖునికి కీడు చేసెడి వాడును
భువికే భారము కద భార్గవ

కలియిండదు కలకాలము
బలముండదు బహుకాలము
సలిమి లేముల కలిసున్నదే
దంపత్యమన్న ఇలలో భార్గవ

ఘడియకు తప్పులు వేతికేడి పురుషుని తోటి జీవితము
ప్రతి పనికి సాధించేడు ఎజమాని వద్ద కొలువును
యంత చదివిన వంటపడని సాహిత్యము
వెను వెంటనే వదలి వేయుట మంచిది భార్గవ

తా తినక పరుల కిచ్చుట దైవత్వము
తా తిని పరుల కిచ్చుట మానవత్వము
తా తిని పరుల మరచుట రాశాసత్వము
మనుజులము మానవత్వమున్న చాలు భార్గవ

అమ్మను అడుగక పెట్టదు అన్నము
తండ్రిని కోరనిదే ఇవ్వడు ఎదిఉను
సుతుడును కోరకనే సమకూర్చాడు దేదియు
అడుగుటకు వేనుకిడిన దొరకదు ఐదియు భార్గవ

కలహంభులకు దుఉరముగా నుండుము
చెలిమియే సాదరమున స్వగాతించుము
పరులకు ఎప్పుడు కీడును సలుపకు
మనుజులు చేయ మంచి పనులివియే భార్గవ



పరులను యాచేమ్పకు
ఉన్నదానితో సంతసించుము
లేదని డిగులు పడకు
తృప్తిని మించిన సావక్యమేది భార్గవ

అందినదియే అందలము
అందని దానికియ్ అర్రులు చాచకు
కొందరికే అన్నియు అందును
అందరకు అన్నీ అందవు భార్గవ

పరులను ప్రేమతో పిలువుము
అరువులకి ఆస పడకు
తనువుపియ్మోహ పడకు
ఇవేయే పో కావలసినవి భార్గవ

కాలంబుకు విలువ నీయుము
హేయంబును కూడా త్రునముగా చూడుము
సయంబుకు ముందు నుండుము
వాదునకు వెనుక నుండుటయే మిన్న భార్గవ

హరి నామ స్మరణ మరువకు
సిరులను త్యదించుటకు వెరువకు
జ్ఞ్యతుల దరి చేర నివ్వకు
భక్తిని మించిన మార్గ మ్యేది భార్గవ

కోరుము ధనమును భగవంతుని
పరులకు సాకారము చేయుటకు
కోరుము ఆయువుని దేవుని
నిరంతర నామ స్మరణ చైయను
ఇతరములన్నియు వైర్ధము భార్గవ

సంకల్పముకి మించినది లేదు
ప్రారంభించుతయే మంచి ముహూర్తము
అవరోధము లేక సాగుతాయే అవిఘ్న మన్న
వితలాషునికృప ఉన్న సర్వము సమకూరు భార్గవ

సాదువుల యెడ ప్రేమ
బలహీనుల యెడ జలియు
తన వారి ఫై మమకారము
చూపెడు వాడె పో మన్యుడన భార్గవ

అమ్బలియు లేని నాడును
అస్ట్టయేస్వర్యములు సిద్దించిన నాడును
అయోనిజుని మరువని వాడె
నిజమగు భక్తుడు కదరా భార్గవ

సిరి కోరిన యంతనే రాదు
క్యాతి ప్రాకులాడిన పొందలేరు
ఈసుని అగ్నేతోటే ఇలను
కష్ట శుకములు కలుగును భార్గవ

తనదన్నది ఎదిఉను లేని వాడును
కష్ట సుకముల సమముగా చుసేడివాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముషువన్నకదరా భార్గవ

కోరనిదే యెదిఉ రాదు
కోరినను కొన్ని రావు
పొందుట కర్హమినది కోరిన
జగదీసుడు నీ కిచ్చును భార్గవ

పరమను పిలచిన పసిపాపలు నవ్వుదురు
కోపగించిన వెను వెంటనే యడ్చుదురు
భాష తెలియని చిన్నారులు కూడా
భావ మెరుగాగలరు ఇదియ సృష్టి యన భార్గవ

అమ్మ అనుగ్రహము లేనినాడును
తిన తిండి కరువిఎన నాడును
నావారనువారు లేని నాడును
జీవించుట ఏమి సుఖము భార్గవ

ప్రీతిని పెలిచి పెట్టినదియే పాయసము
ద్వేశంబుతో పడవేసిన బస్యంబును విషంబు
ప్రేమను తినిపించినదియే మత్రుత్వమన్న
తల్లి ప్రేమను పొందని జన్మ వృధా భార్గవ
సిరి కోరిన యంతనే రాదు
క్యాతి ప్రాకులాడిన పొందలేరు
ఈసుని అగ్నేతోటే ఇలను
కష్ట శుకములు కలుగును భార్గవ

తనదన్నది ఎదిఉను లేని వాడును
కష్ట సుకముల సమముగా చుసేడివాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముషువన్నకదరా భార్గవ

కోరనిదే యెదిఉ రాదు
కోరినను కొన్ని రావు
పొందుట కర్హమినది కోరిన
జగదీసుడు నీ కిచ్చును భార్గవ

పరమను పిలచిన పసిపాపలు నవ్వుదురు
కోపగించిన వెను వెంటనే యడ్చుదురు
భాష తెలియని చిన్నారులు కూడా
భావ మెరుగాగలరు ఇదియ సృష్టి యన భార్గవ

అమ్మ అనుగ్రహము లేనినాడును
తిన తిండి కరువిఎన నాడును
నావారనువారు లేని నాడును
జీవించుట ఏమి సుఖము భార్గవ

ప్రీతిని పెలిచి పెట్టినదియే పాయసము
ద్వేశంబుతో పడవేసిన బస్యంబును విషంబు
ప్రేమను తినిపించినదియే మత్రుత్వమన్న
తల్లి ప్రేమను పొందని జన్మ వృధా భార్గవ

ఆశలకు రెక్కలు వచ్చిన
రెక్కలు వచ్చిన చీమల భంగిని
అనతి కాలమున నేలను వ్రాలును
ఉహల నదుపు చైసినా వాడె మనుజుడు భార్గవ

సుఖములు మరగిన వడలు సోమరియగున్
శ్రమ పడిన కాని తనువుకు ఆరోగ్యమబ్బాదు
కాస్తసుకముల సమముగా చూసేది మనుజుడే మనుజుడు
సన పెట్టిన కాని సతికి పదును పెరగదు భార్గవ

నీతులు పరులకు చెప్పుట తేలిక
వాటిని ఆచరిన్చుతయే దుర్లభము
తచేసినదే చప్పుట మణుల గుణము
మణుల నవలంబించుట శ్రేయము భార్గవ


నీతులు పరులకు చెప్పుట తేలిక
వాటిని ఆచరిన్చుతయే దుర్లభము
తచేసినదే చప్పుట మణుల గుణము
మణుల నవలంబించుట శ్రేయము భార్గవ

ప్రానమున్నంత వరకు ప్రార్దిన్చెద పరమేసుని
జీవ మున్నంతవరకు జపిఎన్చెద జగదీసుని
ఊపిరున్నన్త వరకు పూజిన్చెద ఆయోనిజుని
నీది నీదరికి చేరువరకు అన్యుల తలవడు భార్గవ

6 comments:

swapna@kalalaprapancham said...

Welcome to blogger world

Anonymous said...

వైరాగ్యం పాలు తగ్గించండి. భక్తిపాలు పెంచండి.

C.Bhargava Sarma said...

అరణి గర్భ సంజాతంబినట్టి అగ్ని వలె
దైవనుగ్రహ సంజతంబుగా భావిస్తూ నా కవితల నల్లినాను
నేను ఏ పదానికి కాని పదార్ధానికి కాని కార్తురత్వం వహించటం లేదు
కేవలము దైవ కృపగా భావిస్తున్నాను అట్టి తరి హెచ్చు తఃగ్గుల ప్రశ్నే లేదు
మీ సూచనకు ధన్యవాదాలు
భార్గవ శర్మ

Kodavanti Subrahmanyam said...

ప. మాయ కాయమ్మిది జీవా దీని
మాయలో పడి చెడకు జీవ
1. ఆసలెన్నొ పడుచు నుందువు
శ్వాస వున్న వరకె చెల్లును
శ్వాస వీడిన ఆస వీడును
వీసమైన వెంట రాదుగా

2.కట్టె కట్టెల కాలునప్పుడు
మట్టిలోనను కలియునప్పుడు
కట్టు కొన్నవి కానరావుగా
కట్టెపైనను మోజు దండగ


3.దేహమందుండును దేహియే
దేహము కాదు నువు దేహివి
దేహ భ్రాంతిని మదిని వీడిన
దేహియే దైవమై వెలయును

4.మోహమనునది నాశమందుట
మోహక్షయమందుటెమోక్షము
దేహధారియే దైవము సం
దేహములేదిదియె సత్యము
రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com

C.Bhargava Sarma said...

మీ రచన చాల బాగుంది ఇంకా పంపండి - భార్గవ శర్మ

Kodavanti Subrahmanyam said...

http://mohamoksha.blogspot.com/
ప. పెద్ద నిధి యున్నను పేరెంతయున్నను
పెద్ద నిద్దుర నెవరు తప్పించగలరు
అ.ప.ముద్దుముచ్చటలన్ని మృత్యువునుచేరు
వద్దన్నవదలనివి చావు పుట్టుకలు

1. పుట్టిన ప్రతి జీవి గిట్టుట తధ్యము
కట్టెయై మిగులును కాలమే తీరును
చుట్టాలు పక్కాలు చుట్టు ప్రక్కలవారు
పట్టుకొని పోవుదురు పాడె కట్టుకుని

2. తాత ముత్తాతలు రాజులు రౌతులు
కాల గర్భములోన కన్ను మరుగైరి
నీవును నేనును ఏనాటికైనను
కైలాస భూమిలో కాలవలసినదే

3. పెద్ద నిద్దుర లేని పరమాత్మ చేరెడి
నిద్దురయె తెలివియగు నిజమొకటి కలదు
సద్దు సేయక మనసు సంధ్యనే తిలకింప
అద్భుతంబగు జ్యోతి అంతరమ్మున వెలయు

4. జీవన్ముక్తుడై యుండగలిగెడి యుక్తి
జీవించి యుండగనె పొందగలిగెడి శక్తి
జీవి యందెల్లపుడు జీవించి యుండు
జీవ భావము వీడ దైవత్వమబ్బు

రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం
smkodav@gmail.com